
ప్రజాశక్తి-హిందూపురం : రూరల్ మండలం తూమకుంట పారిశ్రామిక వాడలోని గురునానక్ పరిశ్రమ నిర్వహకులు కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్‌తో చేస్తున్న ఆందోళనకు వైసిపి నాయకులు మద్దతు పలికారు. కార్మికులు మూడు రోజులుగా పరిశ్రమ ముందు ఆందోళన చేస్తున్నారు. బుధవారం పరిశ్రమ ముందు ఆందోళన చేస్తున్న కార్మికులకు వైసిపి నాయకులు తిప్పేరుద్రయ్య మద్దతు పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కార్మికుల పట్ల యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం అన్నారు. సమస్యను కార్మిక శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోయికార్మికులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో కార్మిక సంఘం అధ్యక్షుడు రవికుమార్, వైసీపీ నాయకులు రంగనాథ్, శ్రీకాంత్, సతీష్, చంద్ర, రమేష్, శివప్పతో పాటు కార్మికులు పాల్గొన్నారు.