Sep 03,2023 21:14

కార్యక్రమానికి హాజరైన కార్మికులు, నాయకులు

కడప అర్బన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే తిప్పికొట్టాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం సిఐటియు వర్క్‌ షాప్‌ ర్క్‌లో మాట్లాడారు. జిల్లాలో కార్మికులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కడప ఇండిస్టియల్‌, కొప్పర్తి ఇండిస్టీలో కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయలేదని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం పనికి తగంగ వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కార్మికులకు, ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రయివేట్‌కు ధారా దత్తం చేయడం దుర్మార్గం అన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేయడం అన్యా యమని చెప్పారు. పోరాటం తప్ప మరో మార్గం లేదని కార్మికు లకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామన్న మాట వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. మహిళా కార్మికులకు సరైనటువంటి సౌకర్యాలు లేకపో యినా లేబర్‌ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని తెలిపారు. ప్రయిట్‌ పాఠశాల, ఆస్పత్రుల్లో కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కీం వర్కర్లు అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజనం, మున్సిపల్‌ ,కార్మికులు విద్యుత్‌ కార్మికులు, ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేసే అన్ని రకాల కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రాబోయే కాలంలో కార్మికుల సమస్యల మీద పనిచేసే వాళ్ళకి ఓటేయాలని పిలుపునిచ్చారు. వర్క్‌ షాప్‌ కు బి లక్ష్మీదేవి అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, వెంకటసుబ్బయ్య, భైరవ ప్రసాద్‌, చంద్రశేఖరు, ఆర్‌.లక్ష్మీదేవి, జిల్లా కమిటీ సభ్యులు అంజలీదేవి, విజరు కుమార్‌, లక్ష్మీదేవి, నాగలక్ష్మి, పుల్లయ్య, సుదర్శను, చంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, విజయలక్ష్మి, వెంకటపతి, సుబ్బరాయుడు రంగాల ప్రాంతాల నాయకులు పాల్గొన్నారు.