Dec 05,2022 00:08

మాట్లాడుతున్న కెఎం.శ్రీనివాసరావు

ప్రజాశక్తి -గాజువాక : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేయటమే సిఐటియు విధానమని ఆ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు అన్నారు. భెల్‌ కళాభారతిలో ఆడిటోరియంలో బిహెచ్‌ఇఎల్‌ సిఐటియు 13వ మహాసభ నిర్వహించారు. దీనికి కెఎం.శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మిక వ్యతిరేక చట్టాలపై పోరాటం చేయటమే లక్ష్యమన్నారు. బిహెచ్‌ఇఎల్‌ సిఐటియు ప్రధాన కార్యదర్శి జిటిపి ప్రకాష్‌ మాట్లాడుతూ, కంపెనీ రక్షణ కోసం ఎన్నో పోరాటాలు చేశామన్నారు. భవిష్యత్తులో ఐక్య కార్యచరణతో మరిన్ని కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత మూడేళ్ల కార్యక్రమాలపై రివ్యూ చేశారు. కార్యక్రమాలపై సమీక్ష చేసుకొని, భవిష్యత్తు కర్తవ్యాలపై ముందుకు పోవాలని నిర్ణయించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.
నూతన కమిటీ ఎన్నిక
యూనియన్‌ గౌరవాధ్యక్షులుగా ఎస్‌.జ్యోతీశ్వర రావు, ఉప గౌరవాధ్యక్షులుగా బోగేసు, అధ్యక్షులుగా కె.విజరు కుమార్‌, సహాధ్యక్షులుగా కె.పవన్‌కుమార్‌, సీనియర్‌ వర్కింగ్‌ అధ్యక్షులుగా వశిష్ట కృష్ణమూర్తి, ఎస్‌.వెంకట్రావు, ఉపాధ్యక్షులుగా జి.చిన్నబాబు, కె.కేష్య, పేరిశెట్టి కనకారావు, ప్రధాన కార్యదర్శిగా జిటిపి ప్రకాష్‌, సహ ప్రధాన కార్యదర్శిగా ఎస్‌.అప్పారావు, ఎ.తిరుపతిరావు, సీనియర్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు, పి.శివరాం, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా ఆర్‌.జనార్ధనరావు, జి.రాంబాబు, సహ ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా సిహెచ్‌వి.నారాయణ, బి.కృష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శిగా బి.లక్ష్మణరావు, ప్రచార కార్యదర్శిగా సనపాల జగన్నాధరావు, కోశాధికారిగా కందుల నారపరెడ్డి ఎన్నికయ్యారు.