Dec 12,2022 23:14

సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి - ఆరిలోవ : ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీటిపై కార్మికులు కలసికట్టుగా పోరాడాలని విశాఖ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌, జిల్లా నాయకులు పి.వెంకటరెడ్డి, వరప్రసాద్‌ అన్నారు. ఆరిలోవలోని ఎర్రి దుర్గా కళ్యాణమండపంలో సోమవారం సిఐటియు ఆరిలోవ జోన్‌ మూడవ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు వ్యక్తులకు కారుచవకగా అమ్మకానికి పెడుతోందని విమర్శించారు. దేశంలో కష్టజీవుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మిక చట్టాలు స్థానంలో లేబర్‌ కోడ్‌ తీసుకొచ్చి అన్యాయం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆరిలోవ జోన్‌ ప్రధాన కార్యదర్శి విఎన్‌.కుమార్‌ నివేదికను ప్రవేశపెట్టారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కమిటీ ఎన్నిక
యూనియన్‌ అధ్యక్షులుగా ఐసి.నాయుడు, ప్రధాన కార్యదర్శిగా ఎ.రమణ, కోశాధికారిగా బి.రత్నం, కార్యదర్శులుగా పైడిరాజు, కిషోర్‌ కుమార్‌, ఆఫీస్‌ బ్యారర్లుగా, కమిటీ సభ్యులుగా వంకర ఈశ్వరరావు, అలుగోలు జ్యోతి, మంగమ్మ, రాజు తదితర 8 మందిని ఎన్నుకున్నారు.