Feb 26,2023 19:44

కార్మిక సంక్షేమాలపై మాట్లాడుతున్న స్థానిక సిఐటియు నాయకులు

కార్మిక వ్యతిరేక మెమోలను రద్దు చేయాలి : సిఐటియు



ప్రజాశక్తి - శ్రీశైలం ప్రాజెక్టు

రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన మెమోలను 12, 14 రద్దు చేయాలని సిఐటియ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం నాడు సుండి పెంటలోని సిఐటియు కార్యాల యము నందు సిఐటియు మండల అధ్యక్షులు దర్శనం నాగరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. చిన్న మారెన్న మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం ప్రకారం బిల్డింగు వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమం కోసమే అమలు చేయాలని అన్నారు. అలాగే సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను నిలిపివేస్తూ తెచ్చిన మెమోలను 12, 14 లను వెంటనే రద్దు చేయాలని అన్నారు. యధావిధిగా కార్మిక సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకు అమలు చేయాలని వివరించారు. మరణించిన కార్మికులకు నష్టపరిహారాలను అందజేయ లన్నారు. అనంతరం ఏపీ బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో గౌరవ అధ్యక్షులు దర్శనం నాగరాజు,గౌరవ సలహాదారులు ఎం. చిన్న మారె న్న,అధ్యక్షులు ఏ. రాము, కార్యదర్శి చలమయ్య, కోశాధికారి.వెంకట చెన్నయ్య, కమిటీ సభ్యులు ఏసుదాసు, జె. చెన్నయ్య, కే. చిన్న గోవిందు, జెడ్‌. నాగరాజు,చంటి, జి. సి హెచ్‌. వెంకట చెన్నయ్య, వీ.లక్ష్మయ్య, పి. కాశయ్య, డి. రజాక్‌,మోజస్‌, సంతోష్‌ కుమార్‌, యు.నాగరాజు, చిన్న కాశయ్య, ఎం. శ్యామ్‌, కాకర్ల గిరి, జే. బాల నాసరయ్య, ఓ. మస్తానయ్య, పి. శ్రీనివాసులు, జే.వెంకట కొండయ్య, ప్రతాప్‌, జి. సుజాత ఎస్‌. జాషువా, కే. విజయకుమార్‌, సత్యనారాయణ, ఎన్నయ్యలు ఎన్నికయ్యారు.