Aug 08,2023 20:48

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌

 కడప అర్బన్‌ : మున్సిపల్‌, విద్యుత్‌, విఆర్‌ఎల శాంతియుత ఆందోళనలపై ప్రభుత్వ నిర్బంధకాండ చేయడం దురదష్టకరమని, కార్మిక వర్గాన్ని విస్మరిస్తే ప్రభుత్వ పతనం తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌ తెలిపారు. మంగళవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం బేష జాలకు పోకుండా పరిష్కరించాలని తెలిపారు. జగన్‌ ఎన్నికల వాగ్దానం అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం సరైంది కాదని తెలి పారు. మున్సిపల్‌ మహిళా కార్మికు లపై పురుష పోలీసుల దాడి అమా నుష్యమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వర్గాన్ని విస్మరిస్తే ప్రభుత్వాలు పతనం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌, విద్యుత్‌, విఆర్‌ ఎల శాంతియుత ఆందోళనలపై ప్రభు త్వ నిర్బంధకాండను ఖండించారు. శాంతియుతంగా జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనలకు పిలిపిస్తే, రాష్ట్ర ప్రభుత్వం పోలీసులచే నిర్బంధకాండ ప్రవేశపెట్టిందని, కార్మిక వర్గాన్ని విస్మరిస్తే ఏ ప్రభుత్వమైనా పతనం తప్పదన్నారు. 2019 ఎన్నికల ముందు వైసిపి కాంట్రాక్టు వర్కర్స్‌ అందరిని పర్మనెంట్‌ చేస్తానని అధికారంలోకి వచ్చాక విస్మరించారని విమర్శించారు. జీరో వన్‌ జీరో పద్దు కింద జీతాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇంజినీరింగ్‌ కార్మికు లందరికీ రిస్క్‌ హెల్త్‌ అలవెన్స్‌ అమలు చేయాలని కోరితే కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం భేష రతులకు పోకుండా కార్మికుల న్యా యమైన డిమాండ్లను పరిష్క రించాలని కోరారు. కలెక్టర్‌ ఆఫీస్‌ ముందు శాంతి యుతంగా ఆందోళనకు కార్మికులు చేపడితే ముందస్తు అరె స్టులు, కలెక్టర్‌ ఆఫీస్‌ వద్దకు రాకుండా అడ్డుకోడాలు, ఆందోళన చేస్తున్న మహిళ కార్మికులపై పురుష పోలీసుల దాడి ఏమిటని ప్రశ్ని ంచారు. జిల్లాలో నలుగురు మున్సిపల్‌ కార్మికులపై పోలీ సుల దాడి వల్ల తీవ్రమైన గాయాలు అయ్యాయని అన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామ్మోహన్‌ జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి, నగర కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, ఓబులేసు పాల్గొన్నారు.