ప్రజాశక్తి-విఆర్.పురం
కార్మికులు తమ సమస్యల పరష్కారం కోసం ఐక్యంగా, ఉధృతంగా ఉద్యమించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు పూనం సత్యనారాయణ, నాయకులు పి.వెంకట్, ఎంపిపి కారం లక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం విఆర్ పురంలో సీఐటీయూ ఐదవ మండల మహాసభ సీఐటీయూ మండల అధ్యక్షరాలు సత్యవతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా, మిడ్డేమిల్స్, వెలుగు యానిమేటర్స్ తదితర స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వారికి కనీసవేతనాలు రూ.26 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పర్మినెంట్ చెయ్యాలని, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వంట గ్యాస్, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్నాయని విమర్శించారు. కార్మికుల హక్కులు, చట్టాలను తుంగలోకి తొక్కి బడా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నాయన్నారు.
మండల కమిటీ ఎన్నిక
అనంతరం 21 మందితో సిఐటియు మండలం కమిటీ ఎన్నిక జరిగింది. సిఐటియు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా రాజేశ్వరి, పూనెం సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా సత్యవతి, సోడె కవిత, కార్యదర్శులుగా సిహెచ్.శంకరరావు, అనిత, కోశాధికారిగా రంగమ్మ, కార్యవర్గ సభ్యులుగా నాగమణి, కవిత, కనక లక్ష్మి, సత్యవతి, కారం నాగేశ్వరి, కె.ముత్తమ్మ, రవణమ్మ, పి.లక్ష్మి, ఎన్.ప్రకాష్ రావు, ఎం.దుర్గారావు, అనురాధ, పుల్లమ్మ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.










