సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్
కడప అర్బన్ : కార్మిక సమస్యల పరిష్కారం కోసం సిఐటియు పోరాటాలు నిర్వహిస్తుందని జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని పేర్కొన్నారు. అంగన్‌వాడీ, మున్సిపల్ కార్మికులు, రిమ్స్, విఆర్‌ఎ కార్మికులకు రూ.26 వేలు వేతనాలు ఇవ్వాలన్నారు. ఎన్నికల్లో కార్మి కుల సమస్యలు పరిష్కరిస్తారో వారికి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్, కాంట్రాక్ట్, గ్రామపం చాయతీ, అంగన్‌వాడీలు చలో విజయవాడకు సన్నద్దం కావాలని పిలుపు నిచ్చారు. ఈ నెల 20,21 అన్ని మండలాల్లో రిలే దీక్షలు, 27 పట్టణాల్లో ఆందోళనలు ఉంటాయని, ఆగస్టు 7న కలెక్టరేట్ ఎదుట ఆందోళన, 14 నుంచి 27 వరకు చలో విజ యవాడకు సన్నద్దం కావాలని పిలుపు నిచ్చారు. అంగన్‌వాడీలు పెద్దఎత్తునా పోరటం చేసిన స్పందించకపోవడం దుర్మార్గమని చెప్పారు. సమావేశంలో సిఐటియు నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రారెడ్డి, వెంకటసుబ్బయ్య, జిల్లా కోశాధికారి లక్ష్మిదేవి, నాయకులు పాల్గొన్నారు.










