Aug 04,2023 23:48

కార్మిక శాఖాధికారికి వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థలలో వేతన సవరణకై కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణకు, ఇతర ప్రధాన సమస్యల పరిష్కారానికి కార్మిక శాఖ కలుగ చేశాసుకోవాలని విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ స్ట్రగుల్‌ కమిటీ నాయకులు కోరారు. శుక్రవారం స్ట్రగుల్‌ కమిటి ఆధ్వర్యంలో అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ సుభానికి వినతిపత్రం అందజేశారు.. ఈ సందర్భంగా నాయకులు సి.హెచ్‌.నాగబ్రహ్మచారి, డి.వెంకటేశ్వరరావు, ఎస్‌.గురుబ్రహ్మం, పి.శ్రీనివాసరావు, జి.నాగరాజు మాట్లాడుతూ 2022 సంవత్సరం పిఆర్‌సి గడువు ముగిసి 16 నెలలు దాటినా కొత్త వేతన ఒప్పందానికి యాజమాన్యం సిద్ధంగా లేదన్నారు. తెలంగాణలో కంటే ఏపీలో 30శాతం తక్కువ జీతం పొందుతున్నారని తెలిపారు. తెలంగాణలో కాంట్రాక్టు స్కిల్‌ కార్మికులకు నెలకు రూ.43,160 ఇస్తుంటే, ఇక్కడ రూ.20,598 మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తామని, ఇతర ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. జెఎల్‌ఎం గ్రేడ్‌-2లు ప్రాణాలు పిట్టల్లా రాలుతున్న కనీసం మానవతా దక్పథం లేదన్నారు. మరణించిన వారి స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కారానికి సమ్మెకు పిలుపునిచ్చిన విద్యుత్‌ ఉద్యోగ, కార్మికులతో లేబర్‌ శాఖ చొరవ తీసు సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆగస్టు 17న విద్యుత్‌ సౌదాను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు బుజ్జి, చెన్నకేశవులు, కరిముల్లా, రంగన్న, మహేష్‌ పాల్గొన్నారు.