ప్రజాశక్తి - ఆదోని
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని రైతుసంఘం జిల్లా అధ్యక్షులు కె.వెంకటేశులు కోరారు. మంగళవారం ఎఐటియుసి పట్టణ అధ్యక్షులు వెంకన్న అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. ఆదోనిలోని ప్రభాకర్ థియేటర్ సమీపంలో మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.అంజిబాబు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు అజరు బాబు, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు మల్లికార్జున, ఎంకప్ప, వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు కె.లింగన్న మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. రైతాంగ ఉద్యమం సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయడం లేదన్నారు. రైతాంగ ఉద్యమం సందర్భంగా మరణించిన 730 మందిని నేటికీ ఏ రకంగాను ఆదుకోలేదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో లక్కింపూర్ ఖేర్‌లో ఐదుగురు రైతులపై జీపుతో తొక్కించి వారి మరణానికి కారణమైన కేంద్ర మంత్రి కుమారుని ఇప్పటివరకు అరెస్టు చేయకుండా, కేంద్ర సహాయ మంత్రిని బర్తరఫ్ చేయకుండా బిజెపి ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు. సిఐటియు జిల్లా నాయకులు ఈరన్న, సిఐటియు సీనియర్ నాయకులు మహానంది రెడ్డి, సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, పిఎస్.గోపాల్, సిఐటియు మండల కార్యదర్శి బి.వీరారెడ్డి, రైతు సంఘం మండల అధ్యక్షులు శేఖర్, కార్యదర్శి అయ్యప్ప, వ్యకాస మండల నాయకులు గోవిందు, రెహమాన్, ఈరన్న, గోపాల్, ఎఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి ఒబి.నాగరాజు, జిల్లా సమితి సభ్యులు కల్లుబావి రాజు, వైటి.భీమేష్, ఎం.ప్రకాష్, బికెఎంయు నియోజకవర్గ అధ్యక్షులు గంగన్న, రైతు సంఘం ఆదోని అధ్యక్ష, కార్యదర్శులు చిన్న నరసప్ప, ఎల్లప్ప, బసాపురం ఈరన్న, గోవిందు, చిన్న, రామదాసు పాల్గొన్నారు. కౌతాళంలో వాల్మీకి సర్కిల్ దగ్గర అఖిలపక్ష రైతు సంఘం నాయకులు నిరసన చేపట్టారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.మల్లయ్య, రైతు కూలీ సంఘం మండల కార్యదర్శి జగదీష్, రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశులు, మేలిగేరి ఈరన్న, రైతుసంఘం నాయకులు ఉల్లిగయ్య, రామలింగ, సత్యప్ప, ముకప్ప, రైతు కూలీ సంఘం నాయకులు నాగేంద్రప్ప, మాబాష, ఖాదర్ బాషా, కెవిపిఎస్ నాయకులు మారయ్య, మల్లన్నహట్టి తాయప్ప పాల్గొన్నారు.
ఆదోనిలో మాట్లాడుతున్న వెంకటేశులు










