ప్రజాశక్తి - ఆదోని
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా భవిష్యత్ కార్మిక పోరాటం కోసం, ఆదోని పరిశ్రమల పునర్జీవనం కోసం ఎఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో నిర్వహించే కార్మిక ప్రదర్శన, సదస్సును జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి గంగన్న, ఆర్‌సిసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి కోరారు. మంగళవారం పట్టణంలోని ఆర్‌సిసి కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇక్కడ అన్నీ వ్యవసాయ ధారిత పరిశ్రమలే ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతం వారే కాకుండా వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా పనిచేస్తున్నారని చెప్పారు. 1992లో అమలైన ఆర్థిక సంస్కరణల ఫలితంగా పరిశ్రమలన్నీ మూతపడ్డాయన్నారు. మూతపడిన పరిశ్రమలను తెరిపించేందుకు ఎఐఎఫ్‌టియు ఎన్నో చారిత్రాత్మక పోరాటాలు చేసిందన్నారు. ఆర్‌సిసి రాష్ట్ర కార్యదర్శి ప్రతాప్, ఎఐఎఫ్‌టియు నాయకులు వెంకప్ప, బన్ను హుస్సేని, లక్ష్మన్న, బాష, జాను, ఈరప్ప, పిఒడబ్ల్యు అధ్యక్షులు సుజ్ఞానమ్మ పాల్గొన్నారు.
కరపత్రాలను విడుదల చేస్తున్న నాయకులు










