మంగళగిరి రూరల్: సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజ ధానిలోని ఎర్రబాలెంలో సిఐటియు పతాకాన్ని బుధ వారం సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్షులు ఎం.రవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవి మాట్లా డుతూ కార్మికుల ఐక్యత, పోరాటాలతోనే సమస్యలు పరిష్కార ం లభిస్తుందని అన్నారు. ఐక్యత- పోరాటం నినాదంతో కార్మిక వర్గ సమస్యలపై నికరంగా నిలిచి సిఐటియు పని చేస్తుందని చెప్పారు. లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా సిఐటియు పోరాడుతోందని, కార్మికులకు ఉరితాళ్లుగా మారే లేబర్ కోడ్‌లను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిందని మండిపడ్డారు. కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కారు చౌకగా దారాదత్తం చేస్తున్నారని, ప్రశ్నించిన వారిని నిర్బంధిస్తున్నారని అన్నారు. కార్మిక వర్గాన్ని అణిచి వేసేందుకు ప్రయత్నిస్తున్న బిజెపిని ఇంటికి పంపిస్తేనే కార్మిక వర్గానికి మనుగడ అని అన్నారు. ఎన్ని ఆటం కాలు, ఇబ్బందులు ఎదురైన కార్మిక వర్గ ప్రయోజనాల కోసం నికరంగా సిఐటియు నిలబడిందని చెప్పారు. రాజధాని లోని వివిధ కార్మికుల సమస్యలపై నిరంతరం పనిచేస్తోందని, సిఐటియు ఆవిర్భావ దినోత్సవాన్ని పుర స్కరించుకుని రాజధానిలోని కార్మిక వర్గం ఎదుర్కొం టున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకూ వారికి అండగా నిలబడుతుందని చెప్పారు. కార్యక్రమంలో సిఐ టియు నాయకులు రామారావు, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.
సిఐటియు పతాకావిష్కరణ
ఫిరంగిపురం: ఫిరంగిపురం మండలంలోని స్థానిక పంచాయతి కార్మికుల ఆధ్వర్యంలో సిఐటియు 53వ వార్షికోత్సవ పతాకావిష్కరణ బుధవారం జరిగింది. ఫిరంగి పురం మండలం సిఐటియు కార్యదర్శి షేక్ మస్తాన్ వలి,, సతీష్ సిహెచ్ రామారావు ఇబ్రహీం అనూక్ బాలయ్య ఫిరంగిపురం గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.










