Oct 07,2022 23:53

మహాసభ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి సెల్యూట్‌ చేస్తున్న ప్రతినిధులు

ప్రజాశక్తి-చింతూరు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కార్మికుల హక్కులు, చట్టాలపై దాడిచేస్తూ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నాయని, ఈ విధానాలను ఐక్యంగా తిప్పికొడదామని సీఐటీయూ జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ, పల్లపు వెంకట్‌ అన్నారు. సిఐటియు మండల 8వ మహాసభ సందర్భంగా ముందుగా సిఐటియు జెండాను ఆవిష్కరించారు. శుక్రవారం చింతూరులో పొడియం లక్ష్మణ్‌ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో పూనెం సత్యనారాయణ, వెంకట్‌ మాట్లాడుతూ కేంద్రంలో 2వ సారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను మార్చి 4 లేబర్‌ కోడ్స్‌ను తీసుకొచ్చి కార్మికులను యజమానులకు బానిసలను చేసిందని విమర్శించారు. కార్పొరేట్‌ శక్తులకు దేశాన్ని దొచిపెట్టెందుకు బీజేపీ పూనుకుందని, అందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని విమర్శించారు. బీజేపీ విధానాలకు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మద్ధతు ఇస్తూ కార్మికులను శ్రమ దోపిడీ చేస్తుందని తెలిపారు. ఈ విధానాలపై కార్మిక కర్శక ఐక్యవేదిక ఆధ్వర్యంలో విశాల ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
నూతన కమిటీ ఎన్నిక
అనంతరం 24 మందితో సిఐటియు మండల కమిటీ ఎన్నిక జరిగింది. సిఐటియు మండల అధ్యక్షులుగా సవలం వెంకటరమణ, కార్యదర్శిగా పోడియం లక్ష్మణ్‌, ఉపాధ్యక్షులుగా సావిత్రి, పుష్ప, సహాయ కార్యదర్శులుగా దిలీప్‌, స్వామి, కోశాధికారిగా దారేశ్వరి ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా పార్వతి, కనకదుర్గ, లలిత భద్రమ్మ, యు.ముత్తమ్మ, పి.ముత్తమ్మ, శ్రీదేవి, పైడితల్లి, కాంతమ్మ, రాములమ్మ, లక్ష్మయ్య, రామచంద్రం, సుబ్బారావు, రామరాజు, చంద్రమ్మ, లక్ష్మయ్య, చింత రాంబాబు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్‌ మాట్లాడారు.