మాట్లాడుతున్న మూర్తి
ప్రజాశక్తి -తగరపువలస : కార్మిక హక్కులు, చట్టాలను కాపాడుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన స్థానికంగా సోమవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక యూనియన్ కార్యాలయం నుంచి ప్రయివేట్ మార్కెట్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా నాయకులు ఆర్‌ఎస్‌ఎన్.మూర్తి మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలు దేశ సార్వభౌమత్వానికి ప్రమాదంగా మారాయని విమర్శించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాడి దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు నేడు ఏర్పడ్డాయని తెలిపారు. కార్మిక హక్కులు, చట్టాలు కాలరాయబడుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రవ్వ నరసింగరావు, పలువురు కార్మికులు పాల్గొన్నారు.










