May 30,2023 22:22

సిఐటియు పతాకాన్ని ఆవిష్కరిస్తున్న బేబిరాణి, శేషబాబ్జి, రాజ్‌కుమార్‌


- ఘనంగా సిఐటియు 54 వ ఆవిర్భావ దినోత్సవం
ప్రజాశక్తి - కాకినాడ
కార్మిక హక్కుల రక్షణ కోసం మరిన్ని ఉద్యోమాలు చేపట్టాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (సిఐటియు) 54 వ ఆవిర్భావ దినోత్సవం కాకినాడ జిల్లా సిఐటియు కార్యాలయమైన పి.లక్ష్మీదాస్‌ భవన్‌ వద్ద మంగళవారం ఘనంగా నిర్వహించారు. సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి సిఐటియు పతాకాన్ని ఆవిష్కరించారు. సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బి.టి. రణదివె చిత్రపటానికి దువ్వ శేషబాబ్జీ, కె. సత్తిరాజులు, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పి.రామ్మూర్తి చిత్రపటానికి చెక్కల రాజ్‌కుమార్‌, దుంపల ప్రసాద్‌లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు పర్స సత్యనారాయణ చిత్రపటానికి చంద్రమళ్ళ పద్మ, చామంతిలు, ప్రధాన కార్యదర్శి నండూరి ప్రసాదరావు చిత్రపటానికి మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణలు, జిల్లా కార్మికోద్యమ నిర్మాత జి.ఎస్‌. బాలాజీదాస్‌ చిత్రపటానికి పాలిక రాజేం ద్ర ప్రసాద్‌, రమేష్‌లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బేబిరాణి, శేషబాబ్జి, సత్తిరాజు, ప్రసాద్‌లు మాట్లాడుతూ 1970లో ఐక్యత పోరాటం నినాదంతో, సోషలిస్టు సమాజ నిర్మాణ ఆశయంతో సిఐటియు ఆవిర్భవిం చిందన్నారు. దేశంలో పాలకులు ఎవరైనా కార్మికుల హక్కులు కాలరాస్తున్నారని, ఐక్య ఉద్య మాలు నడపడంలో సిఐటియు తనవంతు పాత్ర పోషించిందన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్‌ కోడ్‌లు తెచ్చిందన్నారు. కార్మికులను విభజించే మతోన్మాద శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. బిజెపి మోడీ బారినుండి దేశాన్ని రక్షించు కుందాం అని పిలుపు ఇచ్చారు. రెజలర్ల ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ జూన్‌ ఒకటో తేదీన జరిగే ఆందోళనలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు భారతి, విజరుకుమార్‌, శివ, ఏడుకొండలు, రాయుడు, వెంకటేష్‌, అప్పారావు, సూర్యారావు, వసంత్‌, రామలక్ష్మి, మీన, రమాదేవి, సత్య, రత్నకుమారి పాల్గొన్నారు. కాకినాడ రూరల్‌ కొవ్వాడ గ్రామపంచాయతీ వద్ద కొప్పిశెట్టి సత్తిబాబు అధ్యక్షతన పంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ నాయ కులు నూకరాజు ప్రసాదు సిఐటియు జెండా ఆవిష్కరించారు. మల్లయ్య, రాజు, లక్ష్మి, శ్రీను పాల్గొన్నారు. పెద్దాపురం యాసలపు సూర్యారావు భవనం సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు సిఐటియు జెండాను ఆవిష్కరించారు. సిఐ టియు మండల కార్యదర్శి డి క్రాంతి కుమార్‌,ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు చింతల సత్యనారాయణ, పాండవగిరి పెయింటింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వడ్డి సత్యనారాయణ, కరణం అప్పారావు, మరిడమ్మ తల్లి పెయిం టింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు తైనాల శ్రీను,గడపా వీరబాబు, ప్రజానాట్యమండలి నాయకులు దారపు రెడ్డి కృష్ణ, రొంగల వీర్రాజు,దారపు రెడ్డి సత్యనారాయణ, మహాపాతిన రాంబాబు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్‌ సిఐటియు మండల కార్యాలయం వద్ద సిఐటియు మండల అధ్యక్షులు బాలం శ్రీనివాస్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు విశిష్టత '' అనే అంశం పై సదస్సు నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఐక్యత పోరాటం నినాదంతో ఏర్పడిన సిఐటియు కార్మిక రాజ్య స్థాపన సోషలిజం లక్ష్యంగా పని చేస్తుంద న్నారు. సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి నరవ సురేష్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు కరణం ప్రసాదరావు, చల్లా మహేష్‌, అంగన్‌వాడీఅర్బన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.అమలావతి, టి.నాగమణి, కె.వర లక్ష్మి, బాలం లక్ష్మి, వాణి, రూరల్‌ నాయకులు జి.మహాలక్ష్మి, ఎస్‌కె. ఫాతిమా, హమాలీస్‌ యూనియన్‌ కార్యదర్శి వి అప్పలరాజు, ఎ.సోమేశ్‌ పాల్గొన్నారు. కరప భవన నిర్మాణ కార్మికుల భవనం, సిఐటియు కార్యాలయం వద్ద మండల సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు జెండాను ఆవిష్కరించారు. ప్రధాన కార్యదర్శి పి వీరవేణి అధ్యక్షులు కె సురేష్‌ , 104 ఉద్యోగులు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం త్రిమూర్తులు, ఎస్‌ వరలక్ష్మి, జి.నారాయణమ్మ, పి. దామోదర్‌ లక్ష్మి, కె.సత్య, వై.అనంతలక్ష్మి, కమల, బి.రాంప్రసాద్‌ పాల్గొన్నారు. ఫోటోజి కోటనందూరు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌కె పద్మ ఆధ్వర్యంల కార్యకర్తలు ఆశ, ఇతర కార్మికులలతో కలిసి పతాకాన్ని ఆవిష్కరించారు. రామ లక్ష్మి, సత్యవతి, లక్ష్మీ, కమలారాణి, నాగరత్నం పాల్గొన్నారు.