కార్మిక హక్కుల పరిరక్షణే ధ్యేయం
- సిఐటియు రాష్ట్ర నాయకులు గౌస్ దేశారు
ప్రజాశక్తి - దేవనకొండ
నూతన ఆర్థిక విధానాలు ప్రపంచీకరణ నేపథ్యంలో ఉపాధి కరువుతున్న సందర్భంగా కార్మికుల ఉపాధి, హక్కుల పరిరక్షణకు సిఐ టియు ఉద్యమస్తుందని, కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయం అని సిఐటియు రాష్ట్ర నాయకులు గౌస్ దేశారు పేర్కొన్నారు. శుక్రవారం తెర్నేకల్ గ్రామంలో హమాలీ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు సందర్భంగా అరుణ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అరుణ్ కుమార్, వైసీపీ మండల కన్వీనర్ మల్లికార్జున, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్, మాజీ ఉపసర్పంచ్ సత్యరాజ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. సిఐటియు మండల కార్యదర్శి అశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఉపాధి కరువవుతున్న సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో యువత కష్టపడి పని చేస్తూ స్వతంత్రంగా ఉపాధి పొందుతూ గ్రామాల్లో ఇతరులకు ఆదర్శంగా నిలబడాలని పేర్కొన్నారు. అదేవిధంగా కలిసికట్టుగా యూనియన్‌గా ఏర్పడడం ద్వారా కార్మికచట్టం ప్రకారం కొన్ని హక్కులు వస్తాయని హక్కుల ద్వారా కూడా కొంత లబ్ధి పొందొచ్చు పేర్కొన్నారు. గ్రామంలో కొత్తగా ఏర్పడిన హమాలి వర్కర్స్ యూనియన్ రైతులు, వ్యాపారులతో సఖ్యతగా ఉండి పరస్పర సహకారంతో అవగాహనతో పని చేయాలని, తద్వారా వీరోచిత పోరాట చరిత్ర గల తెర్నేకల్ గ్రామానికి మంచి పేరు తేవాలని వారు కోరారు. ఎర్రజెండా నాయకత్వంలో అనేక పోరాటాలు తెర్నేకల్ గ్రామంలో జరిగాయని రైతులు ,ప్రజలు, సామాన్యులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం పోరాటం ద్వారా వచ్చాయని భవిష్యత్తులో కూడా ప్రజా సంఘాల కు గ్రామస్తులు సహకారం ఆదరించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కార్మిక రైతు యువజన తదితర నాయకులు బజారి, రాఘవరెడ్డి, మహబూబ్ బాషా, రైతు సంఘం మండల కార్యదర్శి సూరి సంజన, సిఐటియు మండల అధ్యక్షులు పాండు, డివైఎఫ్‌ఐ మండల నాయకులు శ్రీనివాసులు, వీరేంద్ర గ్రామ పెద్దలు చిన్న యంకప్ప, చందరాముడు హమాలీలు సుధాకర్, ఏలియా, రవీంద్రబాబు, శాంతి, ల్లోకయ్య,రంగన్న, చిన్నా రంగన్న, బెంజిమెన్ తదితరులు పాల్గొన్నారు.










