Mar 29,2023 22:33

ప్రజాశక్తి - ఏలూరు
            కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి విమర్శించారు. సిఐటియు, రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలురైతు సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ విజయవంతం కోరుతూ ఏలూరు నగరంలో రెండో రోజు బుధవారం ప్రచార జాతా నిర్వహించారు. ఈ జాతా తంగెళ్లమూడి బిల్డింగ్‌ సెంటర్‌ నుండి ప్రారంభమై చోడిదిబ్బ, రాణినగర్‌, ఇజ్రాయిల్‌పేట, కుమ్మరిరేవు, తాపీమేస్త్రి కాలనీ, కండ్రికగూడెం సెంటర్‌, టైటాన్స్‌ నగర్‌ గుండా సాగింది. జాతానుద్దేశించి రవి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్మికునికీ నెలకు రూ.26 వేలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీలో వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 200 రోజులు పని, రోజుకి రూ.600 వేతనం ఇవ్వాలన్నారు. కౌలు రైతుల సంక్షేమానికి సమగ్ర చట్టం తేవాలన్నారు. ఈ జాతాను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పిల్లి రామకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు నేతలు వి.సాయిబాబు, బి.జగన్నాధరావు, బి.సోమయ్య, గోపీ, జి.కోటేశ్వరరావు, అప్పన్న, వరద వెంకట్రావు, రవీంద్ర పాల్గొన్నారు.
చింతలపూడి: చలో ఢిల్లీ ప్రచార యాత్ర చింతలపూడి మీదుగా సాగింది. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌విఎస్‌.నారాయణ, జిల్లా కార్యదర్శి ఎం.నాగమణి, వ్యవసాయ కార్మిక సంఘం నేత టి.అన్నవరం, రైతుసంఘం నాయకులు ఎ.మురళీ మాట్లాడారు. కార్యక్రమంలో డి.సత్తిబాబు, టి.ముత్యాలమ్మ, ఎన్‌.సరోజిని, మాణిక్యం, సరళ పాల్గొన్నారు.
చాట్రాయి: చలో ఢిల్లీ ప్రచార యాత్ర చాట్రాయి మీదుగా సాగింది. ఈ సందర్భంగా జాతా నేతలు ఆర్‌విఎస్‌.నారాయణ, ఎం.నాగమణి, టి.ముత్యాలమ్మ, ఎ.మురళీ మాట్లాడగా స్థానిక నేతలు కె.భాస్కరరావు, కొమ్ము ఆనందం, మేడేపల్లి హోలీ మేరీ పాల్గొన్నారు.
టి.నరసాపురం: చలో ఢిల్లీ విజయవంతం చేయాలని చేపట్టిన ప్రచార జాతా మండలంలోని మక్కినవారిగూడెం, అల్లూరు సీతారామరాజు నగర్‌, టి.నర్సాపురం మీదుగా సాగింది. ఈ సందర్భంగా నేతలు మొడియం నాగమణి, తుమ్మల సత్యనారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో తామా ముత్యాలమ్మ, ఎ.మురళీ, మడకం సుధారాణి, ఎం.కుమారి, జయరాజు, గురుగుంట్ల సావిత్రి, అల్లూరి సీతారామరాజు నగర్‌ వాసులు పాల్గొన్నారు.
ముసునూరు: చలో ఢిల్లీని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జి.రాజు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక మండపం సెంటర్‌ వద్ద ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజుతోపాటు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిల్లి మురళీ, వివిధ సంఘాల నేతలు పి.రాజకుమారి, పోట్రు శ్రీను, కంచర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.