
గుంటూరు: విశాల ఐక్యత ద్వారా ఫాసిజాన్ని ఓడించటమే కార్మిక వర్గం ముందున్న కర్తవ్యమని పౌరహక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. ఎఐటియుసి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మల్లయ్యలింగం భవ న్‌లో కార్మికోద్యమ నేత ఎంవిఎన్ కపర్ధి శతజయంతి ఉత్స వాలు నిర్వహించారు. ఎఐటియుసి రాష్ట్ర గౌరవాధ్య క్షులు వి.రాధాకృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హర గోపాల్ 'వర్తమాన ఆర్థిక, సామాజిక, రాజకీయ పరి స్థితులు-కార్మికవర్గం పాత్ర' అనే అంశంపై మాట్లాడారు. అక్టోబర్ విప్లవం స్ఫూర్తితో కార్మికోద్యమం లోకి అడుగు పెట్టిన కపర్థి కార్మికులకు కనీస హక్కులు ఉండాలని పోరా టాలు సాగించా రన్నారు. దేశంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెంది తీవ్ర జాతీయ వాదంతో చేతులు కలిపిం దని, దీంతో దేశంలో ప్రజాస్వామ్య ఉనికికి ప్రమాదం ఏర్ప డిందని, హక్కులను రక్షించుకోవటంతోపాటు, ప్రజా స్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని కాపాడటానికి కార్మిక వర్గం మరోసారి పోరాటాలకు పూనుకోవాన్నారు. ఏఎన్‌యు ప్రొఫెసర్ వి.అంజిరెడ్డి 'భారత ప్రజా స్వామ్యం- రాజ్యాంగం-ఒక పరిశీలన' అనే అంశంపై ఆయన మాట్లా డారు. నేడు భారతదేశంలోనే కాక అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లోనూ ప్రజాస్వామ్యం సంక్షోభంలోకి వెళ్లిం దన్నారు. ఈ తరుణంలో ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని పాడుకోవ టానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, ఎఐటి యుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంధ్రనాథ్, ఉపా ధ్యక్షులు సోమసుందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి హను మంతరావు, అధ్యక్షులు ఆకిటి అరుణ్‌కుమార్ ప్రసంగించారు.