Oct 26,2023 21:29

బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న ఆర్‌టిసి అధికారులు

ప్రజాశక్తి-విజయనగరం కోట :  ఆర్‌టిసి ప్రవేశపెట్టిన కార్గో డోర్‌ డెలివరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్‌ జె.శ్రీనివాసరావు కోరారు. స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద ఉన్న పార్సిల్‌ రవాణా కార్యాలయం వద్ద గురువారం కమర్షియల్‌ ఎటిఎం దివ్యతో కలిసి డోర్‌ డెలివరీ ప్రచార మాసోత్సవాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ అతి తక్కువ చార్జీలతో ఆర్‌టిసి కార్గో సేవలను ప్రజలలోకి తీసుకుని వెళ్లే సదుద్దేశ్యంతో ఈనెల 26 నుంచి నవంబర్‌ 25వరకు మాసోత్సవాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నగరం లోని ప్రజలు, వ్యాపార సంస్థలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌లు పాల్గొన్నారు.