Oct 19,2022 23:03

మాట్లాడుతున్న కాఫీ బోర్డు ఉప సంచాలకులు ఘోష్‌

ప్రజాశక్తి -పాడేరు: మార్కెట్టులో మంచి ధర పలికినపుడే కాఫీ ఉత్పత్తులను విక్రయించాలని కాఫీ బోర్డు ఉప సంచాలకులు ఘోష్‌ సూచించారు. ఐటిడిఏ, కాపీ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరు కార్యాలయపు సమావేశ మందిరంలో గురువారం పాడేరు మండలంలో కాఫీ సాగు చేస్తున్న రైతులకు బైజాన్‌ వర్కర్లకు ఉద్యానవన సహాయకులతో కాఫీ విక్రయాలు, మర్కెట్టు సదుపాయాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్చిమెంటు కాఫీ ధర బెంగుళూరులో రూ.314లు ఉందన్నారు. అరబికా రకం రూ.180ల నుండి రూ.184ల ధర పలుకు తోందన్నారు. దళారులకు విక్రియిస్తే గిట్టుబాటు ధర రాదని చెప్పారు. ఏజెన్సీలో 1 లక్ష 25 వేల మంది రైతులు కాఫీ సాగు చేస్తున్నారని చెప్పారు. పూలింగ్‌ హేండ్లింగ్‌, కల్చర్‌ పనులు సకాలంలో చేస్తే మంచి దిగుబడులు వస్తాయని చెప్పారు.
జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బిఎన్‌ నంద్‌ మాట్లాడుతూ, మైక్రోఫైనాన్స్‌ రుణాలు తీసుకోకుండా బ్యాంకుల నుండి వ్యవసాయ రుణాలు పొందాలని సూచించారు. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తే తిరిగి ఇస్తాయని చెప్పారు. కాఫీని డ్రై చేసి విక్రయిస్తే మంచి ధర వస్తుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన అధికారి రమేష్‌ కుమారరావు, కాపీ ఎడి శరత్‌, కాఫీ ఎఇఓ అప్పనాయుడు, కాఫీ రైతులు, లైజాన్‌ వర్కర్లు, ఉద్యాన వన సహాయకులు పాల్గొన్నారు.