Feb 02,2023 00:18

మాట్లాడుతున్న ఎంపిటిసి సభ్యులు బుజ్జిబాబు

ప్రజాశక్తి -సీలేరు
కాఫీ రైతులకు న్యాయం చేయకుంటే ఉద్యమం చేపడతామని జికె.వీధి మండలం, గాలికొండ ఎంపీటీసీ సభ్యులు అంపరంగి బుజ్జిబాబు హెచ్చరించారు. బుధవారం గాలికొండ పంచాయితీ చిలకల వీధి గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా 11 మండలాల్లో 47 వేల మంది కాఫీ రైతులకు 2018 నుంచి 2021 వరకు చెల్లించవలసిన రూ.60 కోట్లు వారి అకౌంట్లో తక్షణమే జమ చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజన రైతులు పట్ల ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి పిఓ రోణంకి గోపాలకృష్ణ చిన్నచూపు చూసి వారికి రావలసిన నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 9న జీకే వీధిలో కాఫీ రైతులతో సదస్సును ఏర్పాటు చేశామని, రైతులంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ గేమిల రఘునాథ్‌, రైతులు హిర్మయ్య, మార్కు రాజు పాల్గొన్నారు.