Dec 06,2022 23:45

కాఫీ పండ్లను పరిశీలిస్తున్న పిఒ

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌:మ్యాక్స్‌ సంస్థకు కాఫీ పళ్ళను విక్రయిస్తున్న కాఫీ రైతులకు 24 గంటల్లో చెల్లింపులు చేయాలని ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలకృష్ణ ఆదేశించారు. మంగళవారం పాడేరు మండలం ఇసుకల గరువు గ్రామంలో పర్యటించి మ్యాక్స్‌ సంస్థ ఆధ్వర్యంలో కాఫీ పళ్ళు కొనుగోలును ఆయన పరిశీలించారు. రైతులకు సకాలంలో డబ్బులు అందుతున్నదీ లేనిది అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అంగన్వాడి భవన నిర్మాణం అసంపూర్తిగా ఉందని గ్రామస్తులు పిఒ దృష్టికి తీసుకొచ్చారు. అంగన్వాడి భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని టిడబ్ల్యూ ఇఇని ఆదేశించారు. గ్రామంలో 35 మంది విద్యార్థులు ఉన్నారని, పాఠశాల భవనం మంజూరు చేయాలని గ్రామస్తులు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిఇఒను ఆదేశించారు.