Oct 07,2022 23:07

ఆందోళన చేపడుతున్న కాఫీ రైతులు

ప్రజాశక్తి-పాడేరు: మండలంలోని పలు గ్రామాల కాపీ రైతులు తమకు ప్రోత్సాహక బకాయిలను వెంటనే చెల్లించాలని ఐటీడీఏ వద్ద వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. కాఫీ రైతుల సంఘం రాష్ట్ర నాయకులు జి.చిన్నబాబు, పాలికి లక్కు మాట్లాడుతూ, కాఫీ సాగు చేపడుతున్న రైతులకు తోటల నిర్వహణ కోసం ప్రోత్సాహక సొమ్ము సకాలంలో చెల్లించుకుపోవడంతో రైతులు చాలా నష్టపోతున్నారన్నారు. గిరిజనులు పండిస్తున్న కాపీని ప్రభుత్వమే కొనాలని డిమాండ్‌ చేశారు. మ్యాక్స్‌ సొసైటీ ద్వారా కాఫీ పళ్ళు కిలో రూ.30లకే కొనడంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. కాఫీ రైతులకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి వినత పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాఫీ రైతులు సంఘం నేతలు కొర్ర సూరిబాబు, మోహన్‌బాబు, భాస్కరరావు, రాజబాబు, బాబురావు, మినుములూరు, మోదపల్లి పంచాయతీల గ్రామాల కాఫీ రైతులు పాల్గొన్నారు.