Feb 16,2023 23:15

గిరిజనులతో మాట్లాడుతున్న సర్పంచ్‌ త్రినాథ్‌

జయప్రదం చేయాలని లక్ష్మీపురం సర్పంచ్‌ విస్తృత ప్రచారం
ప్రజాశక్తి- ముంచింగిపుట్టు :
కాఫీ ప్రోత్సాహక బకాయిల చెల్లింపు, ఇతర సమస్యలపై ఈ నెల 17న పాడేరు ఐటిడిఎ ముట్టడి ఆందోళనను జయప్రదం చేయాలని లక్ష్మిపురం సర్పంచ్‌ కొర్ర త్రినాథ్‌ పిలుపునిచ్చారు. ముట్టడి విజయవంతానికి గిరిజన రైతుల సమీకరణలో భాగంగా వారితో మాట్లాడుతూ, ఐటిడిఎ పరిధిలోని 11 మండలాల్లో కాఫీ రైతులకు 2017 నుంచి 2022 వరకు దాదాపు రూ.నాలుగు కోట్లు కాఫీ ప్రోత్సాహక నిధులు చెల్లించాల్సి ఉందన్నారు. ఐటడిఎ పిఒ ఇష్టానుసారంగా రైతలకు చెల్లించాల్సిన కాఫీ ప్రోత్సాహక నిధులను ఇష్టానుసారంగా దారి మళ్లించి ఇతర పనులకు వినియోగం, దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కాఫీ రైతుల సమస్యల పరిష్కారం, ప్రోత్సాహక నిధులు చెల్లింపుల్లో నిర్లక్ష్యం వంటి ఐటిడిఎ పిఒ నిరంకుశవైఖరికి నిరనసగా శుక్రవారం చేపట్టే ఐటిడిఎ ముట్టడి ఆందోళనలో పెద్దఎత్తున కాఫీరైతులు, గిరిజనులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ అర్లబు సత్యం, ధనుర్చారు, పుర్సోతి, కాఫీ రైతులు పాల్గొన్నారు.