Aug 09,2023 00:33

మొక్కలు నాటుతున్న జెడ్పీటీసీ. గంగరాజు

ప్రజాశక్తి-అనంతగిరి:అల్లురి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో కాఫీ నిధుల మంజూరు, రైతులకు ప్రోత్సాహకాలు అందేవిదంగా కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని జెడ్పీటీసీ గంగరాజు తెలిపారు. మండలంలోని ఎగువశోభ పంచాయతీ బీసుపురంలో మంగళవారం మొక్కలు నాటారు. ఈ సందర్బంగా జడ్పిటిసి గంగరాజు మాట్లాడుతూ, బీసుపురం గ్రామంలో ఏడుగురు రైతులకు మొక్కలు పంపిణీ చేసి నాటించడం జరిగిందన్నారు.ఐటిడిఎ నుండి నిధులు విడుదల చేయకపోవడంతో కాఫీ రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.2021 నుండి రైతులకు ప్రోత్సహాం అందకపోవడంతో చేతి పెట్టుబడి చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఐటిడిఎ పరిధిలో పెండింగ్‌లో రూ 5 కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎగువశోభ సర్పంచ్‌ కొర్ర.సింహాద్రి, మండల ఆర్టీ కల్చరల్‌ అధికారి జె. ఈశ్వరరావు, లైజన్‌ వర్కర్లు సీతారామ్‌, అప్పన్న పాల్గొన్నారు.