కాపు ఉత్తమ విద్యార్థులకు లక్ష రూపాయల స్కాలర్ షిప్
పసుపులేటి
హరిప్రసాద్
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):ఉత్తమ ప్రతిభ చూపిన కాపు విద్యార్థులకు స్కాలర్ షిప్ కోసం ప్రతి ఏటా లక్ష రూపాయలు విరాళాన్ని ప్రకటిస్తున్నామని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏపీ కాపు టీచర్స్ వెల్పేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ సభకు హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చాలా మంది కాపు విద్యార్థులు ఆర్థిక స్తోమత సరిపోక విద్యలో రాణించలేదన్నారు. తమకంటే ఎదిగిన కులాలను ప్రేరణగా తీసుకొని అభివద్ధి చెందాలన్నారు. తమకంటే కింది స్థాయిలో ఉన్న వారికి అండగా నిలబడి ప్రోత్సహించాలని పిలుపు నిచ్చారు. విద్యా దానం చేయడం చాలా అదష్ట మని అందుకే ప్రతి ఏటా కాపు విద్యార్థుల చదువుల కోసం లక్ష రూపాయల విరాళం ఇస్తానని తెలిపా రు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కాపు నేతలు ఆమంచి స్వాములు, మంగబాబు, దొరరాజు, ఫణీంద్రకుమార్, నారాయణ రావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.










