చెక్‌ను అందజేస్తున అధికారులు
ప్రజాశక్తి-పాడేరు : జిల్లాలో 1510 మంది వై ఎస్ ఆర్ కాపునేస్తం లబ్దిదారులకు రూ.2 కోట్ల 26 లక్ష 50 వేల లబ్ది చేకూరిందని జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు స్పష్టం చేసారు. కాపు నేస్తం లబ్దిదారులకు నమూనా చెక్కును పంపిణీ చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నుండి వై ఎస్ ఆర్ కాపునేస్తం నాలుగవ విడత నిధులు విడుదల ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టరేట్ నుండి వీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కాపు నేస్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. ఈ కార్య క్రమంలో డిఆర్‌డిఏ పిడి వి.మురళి, బిసి కార్పోషన్ ఎఇఓ కె.శంకర్, కాపు నేస్తం లబ్దిదారులు పాల్గొన్నారు.










