Nov 04,2023 22:56

ప్రజాశక్తి - పెరవలి మండలంలోని కానూరు అగ్రహారం గ్రామంలో మాజీ ఎంఎల్‌ఎ బూరుగుపల్లి శేషారావు ఆధ్వ ర్యంలో భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమం శనివారం నిర్వ హించారు. ఇంటింటికీ వెళ్లి టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించిన 'బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమం గురించి వివరించారు. అనంతరం గ్రామంలో ప్రజా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుల అతికాల రామకష్ణమ్మ (శ్రీను), దాసం బాపన్న నాయుడు, హనుమంతు సుబ్రమణ్యం, సలాది కృష్ణమూర్తి, బొడ్డు రామాంజనేయులు, అబ్బిశెట్టి సత్తిరాజు,పాల్గొన్నారు.