Oct 09,2022 23:56

హుకుంపేటలో నివాళి అర్పిస్తున్న నాయకులు

ప్రజాశక్తి -పెదబయలు :బహుజన సమాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌ 16 వ వర్ధంతి మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు ముందుగా చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరు ఆయన ఆశయ సాదనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాగం దేముడునాయుడు, అరకు అసెంబ్లీ అధ్యక్షులు నాయుడు, మన్మధరావు, నాయకులు రాజుబాబు, మండల అధ్యక్షులు పాంగి సింగన్న, ఉపాధ్యక్షులు పాంగి థౌడు బాబు, తదితరులు పాల్గొన్నారు.
హుకుంపేట:
మండల కేంద్రంలోని కాన్షీరామ్‌ వర్ధంతి సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు అంబేద్కర్‌ విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బిఎస్పీ జెండాను ఆవిష్కరించారు. లకే రాజారావు మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల నుంచి సంపద తరలించే ప్రయత్నంలో నూతన చట్టాలను అమలు చేసి గిరిజన హక్కులను, చట్టాలను దుర్వినియోగం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గం ఇంచార్జ్‌ వంతినిభ మాధవరావు, జిల్లా కార్యదర్శి సిరగం దేముళ్ళు, అరకు నియోజకవర్గ ఉపాధ్యక్షులు వల్లంగి వెంకటేశ్వర్లు, హుకుంపేట మండల అధ్యక్షులు పూజారి రాంబాబు, మండల సెక్రెటరీ లకే వెంకటేశ్వర్లు, గడ్డంగి విశ్వనాథం, లకే బైరాగి, బిడ్డ దేముళ్ళు, మాజీ ఎంపీటీసీలు మత్యేరాజు, మోహన్‌ రాజు, మాజీ జెడ్పిటిసి కాంతమ్మ, మహదేవ్‌, కొండన్న బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.