
ప్రజాశక్తి - అద్దంకి
మాన్యశ్రీ కాన్షీరాం ఆయశాలను కొనసాగిస్తామని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు మందా జోసెఫ్ అన్నారు. స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో సోమవారం కాన్షీరామ్ 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత కాన్షిరాం చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కాన్షిరాం మరణించి 17సంవత్సరాలు గడిచినా ఆయన చేసిన సేవలు నేటికీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాయని అన్నారు. అంబేద్కర్ సాధించిన ఓటు హక్కును భారత రాజ్యాంగంలో పొందుపరిచి అన్ని హక్కులను ఉపయోగించుకుంటూ భారతదేశం అంతా కూడా 40వేలకిలోమీటర్లు తిరిగి ప్రచారం చేశారని అన్నారు. ఓటు హక్కు ద్వారా ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారం తీసుకొచ్చిన వ్యక్తి కాన్షీరాం అని కొనియాడారు. బెహన్‌జి కుమారి మాయావతిని, ఇండియాలోనీ అతిపెద్ద రాష్ట్రంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశాడని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కు నిజమైన వారసుడు కాన్సిరాం అని అన్నారు. ఆయన జీవితాన్ని అంబేద్కర్ ఆశయాల కోసం త్యాగం చేసిన వ్యక్తి అని అన్నారు. అనంతరం కాన్సిరామ్ విగ్రహావిష్కరణ, కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జై భీమ్ భారత్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు పులిపాటి హేబెలు, ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ రాచపూడి వెంకట నరసింహారావు, దాసర బుల్లియ, మనం కోటేశ్వరరావు, పాస్టర్ చంద్రయ్య, మేదర నాగేశ్వరరావు, కొండ్రు మరియబాబు పాల్గొన్నారు.