ప్రజాశక్తి-కంచికచర్ల
పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల రాత పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కంచికచర్ల మండలంలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల రాత పరీక్షకు నిర్వహణకు అధికారులు 5 సెంటర్లు ఏర్పాటు చేశారు. కంచికచర్ల మండలంలో ఆదివారం 4072 మంది అభ్యర్థులు రాత పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం అధికారులు కానిస్టేబుల్ పోస్టుల వ్రాత పరీక్షకు స్థానిక పేరకలపాడు రోడ్డు సమీపంలో గల దేవినేని వెంకట రమణ అండ్ డాక్టర్ హిమశేఖర్ మిక్ ఇంజనీరింగ్ కళాశాలలో 2 సెంటర్లు, కీసర సమీపంలో గల బీజేటి కళాశాల, పరిటాల సమీపంలో గల అమ్రిత సాయి ఇంజనీరింగ్ కళాశాల, ఎంవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను విజయవాడ డీసీపీ మేరి ప్రశాంతి, నందిగామ ఏసిపి కె నాగేశ్వర్ రెడ్డి, పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు.










