గుంటూరు సిటీ: ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఫిరంగిపురానికి చెందిన కానిస్టేబుల్ ఎం.కిరణ్ భార్య సుధారాణికి రూ.2,05,616 చెక్కును ఈస్ట్ సబ్ డివిజన్ అడిషనల్ ఎస్పీ నచికేట్ షేల్కే బుధవారం అందజేశారు.కొత్తపేట, లాలాపేట, పాత గుంటూరు సిఐలు షేక్ అన్వర్ బాషా, ఎం శ్రీనివాసరావు ఎంవి సుబ్బా రావుతో కలిసి ఆయన ఈ చెక్కును అందజేశారు.కిరణ్ కొత్తపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించేవాడు. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా నిలవాలని ఉద్దేశంతో కొత్తపేట, లాలాపేట, ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ ల పరిధిలోని అధికారులు,సిబ్బంది ముందుకొచ్చి ఈ ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబానికి అందించినట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖ తరపున రావలసిన అన్ని ప్రయోజనాలను సకాలంలో అందేలా చూస్తామని, ఏమైనా ఇబ్బందులు ఉంటె తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.










