
కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తున్న ఎస్పీ మాధవరెడ్డి
పుట్టపర్తి రూరల్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎంటి విభాగంలో ఎఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో మతి చెందారు. వారి కుటుంబానికి శాఖ పరంగా రావాల్సిన ఆర్థిక సాయం చెక్కులను కిరణ్ కుమార్ సతీమణి అంజలి కుమారికి ఎస్పీ మాధవ్ రెడ్డి శనివారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. శాఖా పరంగా రావాల్సిన ప్రయోజనాలను త్వరగా అందేలా చూస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విష్ణు ఎఆర్ డీఎస్పీ విజరు కుమార్, సూపరింటెండెంట్ సరస్వతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.