Nov 16,2023 22:56

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్శిటీ: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు గతంలో పిఆర్‌సి ఉన్న ఉద్యోగులకు పిఆర్‌సిని పునరుద్దరించాలని ఎపి కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌సోర్సింగ్‌ సర్వీసెస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు లంకా మణికాంత్‌ అన్నారు. నగరంలోని హనుమంతరాయ గ్రంథాలయం నందు ఆంధ్రప్రదేశ్‌ కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ సర్వీసెస్‌ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సమావేశం గురువారం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పిఆర్సీ పునరుద్దరించాలని కోరుతూ జీవో నెంబర్‌ 27ను సవరించి మరలా పిఆర్సీ వచ్చే విధంగా జీవో నెంబర్‌ 167 ఇచ్చారన్నారు. ఈజివో ఇచ్చి సుమారు రెండున్నర మాసాలు అయినా అమలుకు నోచుకోలేదని అన్నారు. జివో నెంబర్‌ 167 ఉత్తర్వులు ప్రకారం పిఆర్సీని పునరుద్దరించే విధంగా ప్రభుత్వానికి విన్నవించాల్సింగా ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ కోసం విడుదల చేసిన జివో నెంబర్‌ 114 వెంటనే అమలుపరచి అర్హత కలిగిన కాంట్రాక్టు ఉద్యోగులకు చేసిన వాగ్థానం అమలు చేయాలన్నారు. అలాగే 2014 తరువాత జాయిన్‌ అయిన ఉద్యోగులకు టైం బాండ్‌ ప్రకటించి ఆటైంలో రెగ్యులర్‌ అయ్యే విధంగా ఆర్డర్‌లో పొందుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ సభ్యులు శ్రీరామ్‌ రమేష్‌, గిరి, వేణు పలువురు పాల్గొన్నారు.