ప్రజాశక్తి-ఉక్కునగరం : అనారోగ్యంతో పెదగంట్యాడలో గతనెలలో మృతి చెందిన స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుడు వెంకట్రావు కుటుంబానికి కోక్ ఒవెన్ డిపార్ట్‌మెంట్‌లో బ్యాటరీ 1,2,3,4 విభాగాలకు చెందిన 266 మంది కార్మికులు ఒకరోజు వేతనాన్ని సాయంగా తోటి కార్మికుడి కుటుంబానికి అందజేశారు. ఈ మేరకు రూ.1.5 లక్షల చెక్కును మృతుడి భార్య టి లక్ష్మికి సోమవారం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు కాంట్రాక్టు కార్మికసంఘం ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ మాట్లాడుతూ బ్యాటరీ విభాగంలో అధిక వేడి, దుమ్ము, ధూళి, రసాయనాలు వల్లకార్మికుల ఆరోగ్యం దెబ్బతిని మృతి చెందుతున్నారని, అలాగే బ్యాటరీ 2లో పనిచేసే వెంకటరావు కూడా అనారోగ్యం పాలయ్యాడన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మృతుల కుటుంబాలకు యాజమాన్యం నుంచి ఎటువంటి భరోసా దక్కడం లేదని, కేవలం తోటికార్మికులే గడచిన ఇరవై ఏళ్లుగా ఆదుకునే దయనీయ పరిస్థితులు నెలకొనడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఎన్ తాతారావు, బి భాస్కరరావు, కోన రమణ, ఏ శ్రీను, వి తాతారావు, సిహెచ్ పైడిరాజు, గంగరాజు, గోవిందరెడ్డి,కే. పెంటయ్య, రాజా, సైట్ ఇన్‌ఛార్జిలు సత్యనారాయణ రంగా పాల్గొన్నారు.










