Dec 24,2022 22:39

ప్రజాశక్తి-వన్‌టౌన్‌ 

విజయవాడ రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులపై కక్ష సాధింపు విడనాడాలని, ఇటీవల పనిలో తీసేసిన ఆదిలక్ష్మి, ప్రసద్‌లను విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు ఎన్‌టిఅర్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.సి.హెచ్‌. శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. రైల్వేలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్‌ జీతాలు వెంటనే ఇవ్వాలని కోరుతూ శనివారం సి.ఐ.టి.యు విజయవాడ పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో రైల్వే డి.అర్‌.ఎం. ఆఫీసు వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌ పాల్గొని మాట్లాడుతూ రైల్వే స్టేషన్‌లో కాంట్రాక్టు కార్మికులుగా పనిచనేస్తున్న ఆదిలక్ష్మి, ప్రసాద్‌లను అక్రమంగా పనిలో నుండి తొలగించటం అన్యాయమన్నారు. వారిని వెంటనే పనిలో పెట్టుకోవాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే పెండింగ్‌ జీతాలు వెంటనే ఇవ్వాలని, ఈ.ఎస్‌.ఐ, పి.ఎఫ్‌లను అందరికీ సక్రమంగా చెల్లించాలని, అవసరానికి సెలవులు ఇవ్వాలని, కార్మికులపై కాంట్రాక్టరు కక్షసాధింపు చర్యలను ఆపాలని కోరారు. తొలగించిన ఆదిలక్ష్మి,ప్రసాద్‌లను పనిలో పెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు పశ్చిమ సిటీ కార్యదర్శి ఈ.వి. నారాయణ, నాయకులు వెంకటేశ్వరరావు, సీతారాములు, సత్యబాబు, దుర్గారావు, కోటిబాబు, సాంబులు పాల్గొన్నారు.