Oct 14,2023 21:54

ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు కోరారు. ఈ మేరకు వారు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 19 సంవత్సరాలుగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌, కేజీవీబీ టీచింగ్‌ అండ్‌ నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులుగా, ఆయాలుగా, ఫిజియోథెరపిస్టులుగా, మండల లెవెల్‌ అకౌంటెంట్లుగా ఉద్యోగాలు నిర్వహిస్తున్నామని తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు రామన్న, ఓబిరెడ్డి, ఉద్యోగులు వరలక్ష్మి, వరాలు, శకుంతల, చంద్రయ్య ,రాజేష్‌, భాస్కర్‌, పోతులయ్య తదితరులు పాల్గొన్నారు.