
నినాదాలు చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు
ప్రజాశక్తి-గొలుగొండ:వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని గొలుగొండ మండలం ఏఎల్ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట కాంట్రాక్టు ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ 2014 జూన్ 2 నాటికి ఐదు సంవత్సరాలు పూర్తి అయిన వాళ్లకి మాత్రమే అర్హులని ప్రకటించిందని, 2009లో ఏజెన్సీ రిక్రూట్ అయిన వారు ఏజెన్సీ పరిస్థితి దృష్ట్యా 2011 నుంచి 2018 సంవత్సరాల్లో ఏజెన్సీ రిక్రూట్ జరిగాయన్నారు. మైదాన ప్రాంత ఉద్యోగులతో సమానంగా ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులను చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు నాగమణి, వి.ప్రశాంత్ కుమారి, ఫార్మాసిస్ట్ కె.చిట్టిబాబు, హెల్త్ అసిస్టెంట్లు ఉపేంద్ర, ప్రకాష్, వినరుకుమారి పాల్గొన్నారు.