Aug 20,2023 21:24

సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రామాంజులు

 రాయచోటి టౌన్‌ : కాంట్రా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యో గులను, స్కీమ్‌ వర్కర్లను రెగ్యులర్‌ చేయాలని సిఐ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రామాంజులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో సిఐటియు మండల సమన్వయ కమిటీ సమావేశం మండల కార్యదర్శి డి. భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంట్రాక్ట్‌ ఒప్పంద కార్మికులను రెగ్యులర్‌ చేస్తానని ఓట్లు దండుకుని అధికారం చేపట్టి హామీని విస్మరించడం సరైందని కాదని పేర్కొ న్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు మూడు లక్షలకు పైగా ఉద్యోగులు కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన ఏళ్ల తరబడి ప చేస్తున్నారన్నారు. వీరేగాక స్కీమ్‌ వర్కర్‌లు అయిన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కారి ్మకులు, విద్యుత్‌, గ్రామ పంచాయతీ, కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని, వీరంతా తాము ఎప్ప టికైనా రెగ్యులర్‌ అవుతామని ఆశగా ఎదురు చూ స్తున్నారని పేర్కొన్నారు. పైగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీవ్ర ఆందోళనకు, అసంతప్తికి దారి తీసిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఇచ్చిన హామీ ప్రకారం. అందరిని రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో తక్కువ వేతనాలతో జీవోలను విడుదల చేసి కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల శ్రమను దోచు కుంటున్నారుని విమర్శించారు. పెరిగిన నిత్యావసర సరుకులు, పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు, కరెంటు ఛార్జీలు, రవాణా ఛార్జీలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని. వీటి పరి ష్కారానికై అందరు కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కొత్తగా వచ్చారని, ఏడాదే అయ్యిందంటూ మాంత్రి బొత్సా సత్యనారాయణ గారి వ్యాఖ్యలు సరైనవి కావని పేర్కొన్నారు. మంత్రి వాస్తవాలను తెలుసుకుని మాట్లాడటం మంచిదన్నారు. రాష్ట్రంలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు దాదాపు 15 సంవత్సరాలుగా పని చేస్తున్నారని స్పష్టం చేశారు. నామమాత్రపు వేతనాలిచ్చి పని చేయించుకుంటూ కనీసం ఎన్ని ఏళ్ల నుంచి పనిచేస్తున్నారో తెలియని స్థితిలో మంత్రులు, అధికారులు ఉండటం శోచనీయం అన్నారు. కార్యక్రమం లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.వి. రమణ, మండల అధ్యక్షుడు బి. రెడ్డెయ్య, అంగన్వాడీ ఆశా నాయకులు, విజయ, నాగమణి, అరుణ, పద్మజ, కవిత, ముంతాజ్‌, ఆదిలక్ష్మి, విజయనిర్మల, సునీత ,రాణి, శోభ, పుష్ప గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.