Jun 08,2023 19:55

వధూవరులను ఆశీర్వదిస్తున్న చిప్పగిరి లక్ష్మీనారాయణ

ప్రజాశక్తి - చిప్పగిరి
అన్ని తరగతుల ప్రజలు ఆర్థికంగా ఎదగాలంటే కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమని రాష్ట్ర కాంగ్రెస్‌ సహాయ కార్యదర్శి చిప్పగిరి లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం ఆలూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లోని కాంగ్రెస్‌ సానుభూతి కుటుంబాల వివాహ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయి వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాబోయే కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పుంజుకుంటుందన్నారు. గతనెలలో కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయ దుందుభి మోగించిందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుందన్నారు. అందుకు ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచి పార్టీ అభివృద్ధికి పాటుపడతామన్నారు. కాంగ్రెస్‌ నాయకులు చిప్పగిరి వినోద్‌ కుమార్‌, డేగులపాడు మంజునాథ్‌, డి.పోతప్ప, కెఎల్‌.స్వామి దాస్‌, ఆంథోని, కరెంటు గోవిందు, శివ, రాంబాబు, ఆనంద్‌, మల్లికార్జున, చంద్ర, వెంకటేష్‌, రంజిత్‌, వీరాంజనేయులు పాల్గొన్నారు.