ప్రజాశక్తి - హోళగుంద
రాష్ట్రంలో కాంగ్రెస్తోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు సాధ్యమని కాంగ్రెస్ జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా తెలిపారు. శనివారం హోళగుందలో ఆయన మాట్లాడారు. త్వరలో ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు హెచ్.పరసప్ప, పీరా సాబ్, మైనారిటీ నాయకులు ఖాజప్ప, సాయి బాబా, వీరన్న, బోయ సీతప్ప, హరిజన నరసప్ప, బోయ రామారావు, ఎహసాన్, వందవాగిలి మాబు, సయ్యద్ పైజాన్, అబుబాకర్, ఖలీద్, ఖలీల్, ఫరూక్, కురువ ఈరన్న, జావీద్, రాజా సాబ్ పాల్గొన్నారు.