Jul 27,2022 22:47

నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్‌ నేతలు

ప్రజాశక్తి- పెందుర్తి : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఈడీ విచారణను నిరసిస్తూ స్థానిక మండల్‌ పరిషత్‌ కార్యాలయంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద సత్యాగ్రహ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేతల పట్ల బిజెపి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా విచారణ పేరుతో సోనియాను వేధిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు సోనియా ఇలా ఆలోచిస్తే మోడీ ఎక్కడుండేవారో తెలుసుకోవాలని, రానున్న రోజుల్లో రాహుల్‌ ప్రధానిగా ఇంతకుమించి రివర్స్‌గిఫ్ట్‌ ఇవ్వక తప్పదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి వజపర్తి శ్రీనివాస్‌, యువజన కాంగ్రెస్‌ అద్యక్షుడు షేక్‌ షఫీఉల్లా, పరదేశి, రాజు, చిన్నంనాయుడు పాల్గొన్నారు.