May 13,2023 22:42

ఏలేశ్వరంలో స్వీట్లు పంపిణీ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ప్రజాశక్తి - ఏలేశ్వరం
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించడంతో ప్రత్తిపాడు అంబేద్కర్‌ కళామందిర్‌ సెంటర్లో కాంగ్రెస్‌ శ్రేణులు మిఠాయిలు పంచి, బాణాసంచాలు కాల్చి సంబరాలు చేసుకు న్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ ఉమ్మడి వెంకటరావు మాట్లాడుతూ కర్ణాటక ప్రజలు లౌకిక వాదాన్ని స్వాగతించారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కూడా లౌకికవాద కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పిసిసి సభ్యులు ధర్నాలకోట శ్రీను, ఎస్‌సి సెల్‌ అధ్యక్షుడి మొయ్యేటి సూర్యప్రకాశ రావు, బీసీ సెల్‌ అధ్యక్షుడు కొల్లి వీర గణేష్‌, జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పన వెంకటేశ్వరరావు, కార్యకర్తలు దాసరి సత్తిబాబు, కందుమల్ల శామ్యూల్‌ పాల్గొన్నారు.