Oct 13,2023 22:22

మేడ సురేష్‌

ప్రజాశక్తి - గంపలగూడెం: ఆంధ్రప్రదేశ్‌ జాతీయ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మేడ సురేష్‌ నియమితులయ్యారు. ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు సి.వేణుగోపాల్‌ ఈ మేరకు ఉత్తర్వులు పంపారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సూచన మేరకు ఈ ఎంపిక జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అభివద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సురేష్‌ తెలిపారు. నమ్మకం ఉంచి పదవిని కల్పించిన నాయకులకు కతజ్ఞతలు తెలిపారు. 1992లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సురేష్‌ యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, శిక్షణ తరగతుల కన్వీనర్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ సంయుక్త కార్యదర్శి, డిజిటల్‌ మెంబర్షిప్‌ డాష్‌ బోర్డు ఇన్చార్జిగా సేవలు అందించిన విషయం తెలిసిందే. గంపలగూడెం మండలం మిట్ట గూడెం గ్రామానికి చెందిన సురేష్‌ అంచలంచెలుగా ఎదిగారు.