ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 50 ఏళ్ల క్రితం చంద్రునిపై కాలు మోపడం జరిగిందని, ఇదేదో తన ఘనతగా ప్రధాని నరేంద్ర మోడీ డప్పుకోట్టుకొంటుండడం విడ్డూరంగా వుందని మాజీ ఎంపీ చింతా మోహన్ ఏద్దేవా చేశారు. తోటపల్లిగూడూరు మండలంలో సోమవారం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది. సర్వేపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ పూల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చింతా మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూఅంతరిక్ష పరీక్షలు దాదాపు 50 సంవత్సరాల క్రితమే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల హయాంలో శాస్త్ర విజ్ఞానం పెరిగి చంద్రునిపై కాలు మోపడం జరిగిందన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం తాను సాధించిన ఘనతగా డప్పుకోట్టుకొంటుందడం విడ్డూరంగా వుందని ఎద్దేవా చేశారు. బిజెపి, వైసిపి అసమర్ధ పాలనలో ధరలు పెరిగి నిరుపేదల అప్పుల ఊబీలో కురుకుపోయారన్నారు. అలాగే ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో యువత అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. తక్షణం నిరుపేదల అప్పులు రద్దు చేయాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2:30 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని చెబుతోందని, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు రూ 17 వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో ప్రజలకు వివరించాలని అయన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూటిగా ఈ రెండు ప్రశ్నలకు జవాబు చెప్పాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. ఈ నిధులను సక్రమంగా వినియోగించి ఉంటే అన్ని నియోజకవర్గాలు రూ పదివేల కోట్లతో అన్ని రంగాలలో అభివద్ధి చెంది ఉద్యోగ అవకాశాలు లభించి ఉండేవని తెలిపారు. ఈ నేపథ్యంలో అందరం సమైక్యంగా కలిసి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వ అసమర్ధ పాలనపై వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ విభాగం నేతలు నాగరాజు, అంకయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.










