కడప : కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తప్పకుండా వస్తుందని కేంద్ర మాజీ మంత్రి, సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు పల్లంరాజు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు దీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కడపలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీకి 6 నెలలో శంకుస్థాపన చేసి సంవత్సరం లోపల పూర్తి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం 'కడప ఉక్కు - ఆంధ్రుల హక్కు' అన్న నినాదంతో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం కడప నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై నగరంలోని ప్రధాన కూడళ్ళ మీదుగా సాగి 7 రోడ్ల సర్కిల్ వరకు చేరుకుంది. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పల్లం రాజు, గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేంద్రంలో బిజెపి పాలన, ప్రాంతీయ పార్టీలైన టిడిపి, వైసిపి పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది అన్నారు. బిజెపి చేతిలో మూడు పార్టీలు కీలుబొమ్మలుగా తయారయ్యాయి అన్నారు. ఈ ఏడాది చివర్లో జరగబోయే రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల్లో, వచ్చే సంవత్సరం జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. పిసిసి మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి మాట్లాడుతూ కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అని అన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ అథారిటీ ఆఫ్ ఇండియా( సెయిల్) ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు, హంగులు ఉన్నాయన్నారు. ఎఐసిసి సెక్రటరీ మయప్పన్ మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేంద్ర బడ్జెట్లో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో రాగానే మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా మీదనే పెడతానని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్, నగర అధ్యక్షులు విష్ణు ప్రితమ్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ సాకే శంకర్, నజీర్ అహ్మద్, గుండ్లకుంట శ్రీరాములు, బండి జకరయ్య, ప్రభాకర్ రావు, సత్తార్, చీకటి చార్లెస్, పొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి, వేలూరు శ్రీనివాసరెడ్డి, కోటపాటి లక్ష్మయ్య, చెప్పలి పుల్లయ్య, బండి సుమంత్ కుమార్, శ్యామలాదేవి, ధవ కుమార్ రెడ్డి,మామిళ్ళ బాబు, సుబ్బారెడ్డి, మధు రెడ్డి,సుబ్రహ్మణ్య శర్మ, నజీరు, మల్లెం భాస్కర్, లావణ్య, సురేష్, ఓబులేసు, గంగాధర్, అబ్దుల్, ప్రసన్న కుమార్, శ్రీహరి, ఫారూఖ్, గౌరీ, జయకష్ణ, హబీబుల్లా, మహబూబ్ పీర,ఎల్లయ్య, అలీ ఖాన్, రహమతుల్లా ఖాన్,అశోక్ రావు, వంశీ, జీవన్ కుమార్, కదిరి ప్రసాద్, రామ కష్ణ, ఉతన్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు మహిళా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










