Jan 20,2023 23:49

చీడికాడలో మాల్లాడుతున్న కాంగ్రెస్‌ నేతలు

ప్రజాశక్తి-నర్సీపట్నంరూరల్‌:కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రాహుల్‌ గాంధీ .జోడో యాత్ర ముగింపును పురస్కరించుకుని ఈ నెల 26 నుంచి మార్చి 26 వరకు పిసిసి అధ్యక్షులు రుద్రరాజు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తారని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాకేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్‌గాంధీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అనేక వర్గాల ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ విధివిధానాలు తెలియజేశారని తెలిపారు.మోడీకి తొత్తులుగా వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ప్రత్యేక హౌదా, పోలవరం పూర్తి కావాలన్నా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వంటి అంశాలు సాధించడం కోసం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్ర మంలో నర్సీపట్నం పార్టీ కన్వీనర్‌ మీసాల సుబ్బన్న, నాయకులు నంగిన వెంకటరమణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చీడికాడ:రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడమే ధ్యేయంగా పని చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాసరావు తెలిపారు. తన స్వగృహం వద్ద నియోజకవర్గంలోని పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు పోసారెడ్డి రాకేష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా బొడ్డు శ్రీనివాస్‌ మాట్లాడుతూ,నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో విశాఖ నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు గోవిందరాజు పాల్గొన్నారు