సంతకాల సేకరణ చేపడుతున్న శాంతకుమారి, నేతలు
ప్రజాశక్తి- పెదబయలు రూరల్:బోయ/ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పాచిపెట్టి శాంత కుమారి ఆధ్వర్యంలో సంతల కాల సేకరణ సోమవారం చేపట్టారు. విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో పెట్టిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈనెల 17నుండి మే నెల 15 వరకు ఈ కార్యక్రమం చేపడతామన్నారు.సామాజిక తెగల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ స్వ ప్రయోజనాలు, ఓట్లు, సీట్ల కొరకు దుర్మార్గంగా ఆలోచించడం సరికాదన్నారు.ఈ కార్యక్రమంలో అరకు మండల కార్యదర్శి, యూత్ నాయకులు వెంకట్, పెదబయలు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొర్ర కోమటి, పరుశురాం, కొర్ర కొండబాబు, మత్స్యరాజు పాల్గొన్నారు.










