Sep 07,2023 22:08

ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు లాం తాంతియ కుమారి అధ్వర్యంలో గురువారం స్థానిక జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుండి కోనేరు సెంటర్‌ మీదుగా రైతు బజార్‌ వరకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ప్రారంభించి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పాదయాత్రలకు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఈ సందర్బంగా రాజీవ్‌ గాంధీ విగ్రహానికి, అనంతరం అంబేద్కర్‌ సర్కిల్లోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్టేట్‌ ముస్లిం మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షులు మొహమ్మద్‌ ఫిరోజ్‌ బేగ్‌, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి, పిసిసి సెక్రెటరీ మొహమ్మద్‌ దాదాసాహెబ్‌, పెడన అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు డాక్టర్‌ సిహెచ్‌ అప్పారావు, డిసిసి మీడియా చైర్మన్‌ ఊటుకూరి శాంతిరాజు, బందరు మండల అధ్యక్షుడు పాండురంగ విటల్‌ కోన, డిసిసి సేవాదళ్‌ అధ్యక్షుడు చిలుగోటి ప్రసాదరావు, జిల్లా ఎస్సీ, ఎస్టీ అధ్యక్షులు రావు రమేష్‌, స్టేట్‌ మహిళా నాయకురాలు త్రిశూల చుక్క, అవనిగడ్డ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు మండల అధ్యక్షులు రాఘవులు, కాంగ్రెస్‌ నాయకులు, అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.