Oct 06,2023 23:48

పల్నాడు జిల్లా: రాహుల్‌ గాంధీకి దేశ ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రధాని మోడీ, బిజెపి నేతలు సోషల్‌ మీడి యా వేదికగా రాహుల్‌ గాంధీని రావణాసురుడిగా చిత్రీ కరిస్తూ ప్రచారం చేయడం బిజెపి అసమర్థతకు నిదర్శ నమని డిసిసి పల్నాడు జిల్లా అధ్యక్షులు అలెగ్జాండర్‌ సుధా కర్‌ విమర్శించారు. తమ నేత రాహుల్‌óని కించ పరిచేలా బిజెపి చేస్తున్న ప్రచారానికి వ్యతిరేకంగా శుక్ర వారం స్థానిక వినుకొండ రోడ్డులో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యా లయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. బిజెపిక,ి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో చిలకలూరిపేట కన్వీనర్‌, ఏపీసీసీ అధికార ప్రతినిధి ఎం.రాధాకృష్ణ, నాయకులు అనిల్‌, పల్నాడు జిల్లా నాయకులు ఎస్‌.ఎం భాష, సీదా కృష్ణ, ఆకారపు పూర్ణ, నిమ్మకాయల బాజీ తదితరులు పాల్గొన్నారు.